- రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటాలి
- వరంగల్ క్రికెట్ జట్టుకు సీపీ ఎన్ శ్వేత ఐపిఎస్ శుభాకాంక్షలు
హనుమకొండ, మహా;
ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న 5వ రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 లో పాల్గొనేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున క్రికెట్ జట్టును ఎంపిక చేశారు.
ఈ జట్టుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి.విశ్వేశ్వర్ నాయకత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్రికెట్ జట్టు సభ్యులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాస్ఫూర్తితో ఆడి, ఉత్తమ ప్రతిభ కనబరిచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జట్టు సభ్యులందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.








