Mahaa Daily Exclusive

  పీవీ సింధూకు అరుదైన గౌరవం

Share

  • ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియామకం
  • 2030 వరకు పదవీకాలం

 

న్యూఢిల్లీ, మహా : భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టిన సింధుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.ఇదే కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఐఓఏ జనరల్ బాడీలో అథ్లెట్ల ప్రతినిధులుగా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, స్విమ్మర్ సజన్ ప్రకాశ్ ఎన్నికయ్యారు.మరోవైపు పీవీ సింధు, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోనూ సభ్యులుగా కొనసాగనున్నారు. వీరి పదవీకాలం 2030 వరకు ఉండనుంది. భారత క్రీడారంగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన పీవీ సింధుకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అథ్లెట్ల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.