Mahaa Daily Exclusive

  ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్!

Share

  • ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్!
  • రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారి
  • కాంట్రాక్టర్ బిల్లు విడుదలకు లంచం డిమాండ్
  • గతంలో రూ.10 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు

భైంసా, మహా : నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో లంచం వ్యవహారం కలకలం రేపింది. రూ. 50 వేల లంచం తీసుకుంటూ భైంసా ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన రూ.2.63 లక్షల పెండింగ్ బిల్లు విడుదల చేసేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేలు తీసుకుని రూ.6.40 లక్షల చెక్కును విడుదల చేసినట్లు సమాచారం. తాజాగా మరో బిల్లు మంజూరు చేసేందుకు రూ.50 వేలు తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి కారు డ్యాష్‌బోర్డులో ఉంచిన లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.