Mahaa Daily Exclusive

  రూ.800 కోట్లతో ఏపీలో సాల్వో ఇండస్ట్రీస్ పెట్టుబడులు..

  • రూ.800 కోట్లతో ఏపీలో సాల్వో ఇండస్ట్రీస్ పెట్టుబడులు
  • 3 వేల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందం
  • మంత్రి నారా లోకేశ్‌తో ఎంవోయూపై సంతకాలు

అమరావతి, మహా : పారిశ్రామిక రంగంలో తనదైన గుర్తింపు పొందిన సాల్వో ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.800 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసి సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి సంస్థ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీకి సంబంధించి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న సాల్వో ఇండస్ట్రీస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలోనూ భాగస్వామి కానుంది.

ఇప్పటికే తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌, ఒడిశా రాష్ట్రాల్లో మైనింగ్‌ పేలుడు పదార్థాలు, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన సేవలు అందిస్తోంది. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), అదానీ గ్రూప్‌ వంటి ప్రముఖ సంస్థలకు రక్షణ రంగానికి సంబంధించిన పేలుడు పదార్థాలను సరఫరా చేస్తూ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. తాజాగా ఏపీలో రూ.800 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ప్రాజెక్టు ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందంపై మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. సాల్వో ఇండస్ట్రీస్‌ పెట్టుబడితో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. సాల్వో ఇండస్ట్రీస్‌ విస్తరణతో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. శాలువా ఇండస్ట్రీ చైర్మన్ ఐలేని జయరాంరెడ్డి. శాల్వో మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి లు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share