Mahaa Daily Exclusive

  నేడు నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్…

Share

  • నేడు నాగర్ కర్నూల్ జిల్లాకు
    సీఎం రేవంత్
  • రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు
  • సొంత జిల్లాపై వరాల జల్లు
  • నేడు ఇందిరమ్మ చీరల పథకం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా, మహా : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గురువారం పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటుకు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో అచ్చంపేటకు చేరుకోనున్నారు. అచ్చంపేటలో హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగసభా ప్రాంగణానికి సీఎం వెళ్లనున్నారు. బహిరంగ సభ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత నూతన పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. రూ.450 కోట్లతో నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

శంకుస్థాపనల వివరాలివే..

– మద్దిమడుగులో… రూ.15 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

– రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు.

– రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

– అచ్చంపేట బహిరంగ సభ ప్రాంగణంలో.. రూ.274.32 కోట్లతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీటీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన.

– రూ.29.65 కోట్లతో నాగర్ కర్నూల్, పెద్ద కొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన.

– రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

– రూ.18.105 కోట్లతో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

– రూ.14 కోట్లతో అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

– రూ.2 కోట్లతో అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.