మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాo… పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు… క్రైమ్ ఖమ్మం నవంబర్ 25 (మహా) మహిళల భద్రత భరోసా కల్పిస్తున్నామని జిల్లా పోలీసులు సునీల్ దత్ అన్నారు, ఖమ్మం నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు, ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు కేసుల పురోగతి రికార్డులు పరిశీలించారు, స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై సమీక్షించి పలు సూచనలు చేశారు, సున్నతమైన భార్యాభర్తల మధ్య వివాదాలు ఫిర్యాదులపై దృష్టి సారించాలన్నారు, ప్రతి ఫిర్యాదును సానుకూలంగా పరిశీలించి కుటుంబ సమస్యల పరిష్కార నేపథ్యంలో ఇరుపక్షాల వాదనను సామరస్య ద్వారంలో పరిష్కరించుకోవాలన్నారు, స్టేషన్లో సందర్శించే మహిళలతో మర్యాదగా వ్యవహరి వారి సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునే విధంగా సిబ్బంది పని చేయాలని దిశ నిర్దేశం చేశారు, ఈ కార్యక్రమంలో మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు,








