Mahaa Daily Exclusive

  వివాహవేడుకకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు…

Share

 

కారేపల్లి, మహ : ప్రభుత్వ రంగ సంస్ధ బెల్ కంపెనీ జీఎం గుగులోత్ రవి సోదరి సావిత్రి-అనిల్ కుమార్ వివాహ వేడుక బుధవారం కారేపల్లిలో జరిగింది. ఈ వేడుకకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లు వేరువేరుగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మంత్రి పొంగులేటి తరుపున జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు- రమాదేవి దంపతులువధువరులనునూతన వస్త్రాలను అందజేశారు. ఈ వివాహ వేడుకకు మంతి క్యాంపు ఇంచార్జీ తంబూరి దయాకర్ రెడ్డి, మార్క్ ఫెడ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొర్ర రాజశేఖర్, బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు బానోత్ సుందర్ లాల్,కారేపల్లిసోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్, నాయకులు బానోత్ విజయబాయి, పగడాల మంజుల, బానోత్ రాంమ్మూర్తి, అడ్డగోడ ఐలయ్య, గుగులోత్ శ్రీను, మల్లెల నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భూక్య చందు నాయక్, బర్మావత్ కోటి,తదితరులు పాల్గొన్నారు.