*నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్లకు ఐఎన్టీయూసీ ఘన సత్కారం!
* జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు సునీల్ వర్మ, బొల్లం శ్రీనివాస్‌లకు శాలువాలతో సన్మానం
* కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
* ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్
సత్తుపల్లి, నవంబర్ 25: మహా
సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ వర్మ, బొల్లం శ్రీనివాస్‌లను ఐఎన్టీయూసీ నాయకులు ఘనంగా సత్కరించారు. బుధవారం ఆయా ఓసీల పిట్ సెక్రటరీలు సీతారామరాజు, షణ్ముఖాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, సత్తుపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు పాల్గొని ప్రాజెక్ట్ ఆఫీసర్లకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతోపాటు కార్మికుల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షిస్తూ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న జేటీఓ చెన్నకేశవరావును ఐఎన్టీయూసీ నాయకులు శాలువాతో సత్కరించి ఆయన సేవలను అభినందించారు. ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టకముందు యూనియన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేశారని త్యాగరాజన్ గుర్తుచేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబరం, బ్రాంచ్ సెక్రటరీలు మురళీకృష్ణ, నగేష్, నజీర్, జగదీష్, రమేష్, సది, ఇక్బాల్, ఖాజా, రాజేందర్, ఆకుల వెంకన్న, దొంతమల్ల శ్రీను, వామనమూర్తి, యాకూబ్, అన్వర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.








