Mahaa Daily Exclusive

  ఈ నెల 29న అశ్వారావుపేటలో దీక్షా దివస్.. భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు

Share

  • ఈ నెల 29న అశ్వారావుపేటలో దీక్షా దివస్.. భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు
  • సాయి రంగా ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం
  •  మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహణ

అశ్వారావుపేట, నవంబర్ 25, (మహా) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరాటానికి గుర్తుగా ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ కోఆర్డినేటర్ జూపల్లి రమణారావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్న సాయి రంగా ఫంక్షన్ హాల్ వద్ద జరగనుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూపల్లి రమణారావు కోరారు.