Mahaa Daily Exclusive

  నాగులవంచలో మాగం పవన్ – నందిని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

Share

నాగులవంచలో మాగం పవన్ – నందిని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నాగులవంచ: ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామంలోని వివిసి ఫంక్షన్ హాల్‌లో మాగం కొండలు, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు మాగం పవన్, నందినిల వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, నాగులవంచ దేవాలయ కమిటీ చైర్మన్ ముత్తినేని వెంకటేశ్వర్లు, నాగులవంచ గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు ఇమ్మడి కాశయ్య, నాగులవంచ మాజీ నీటి సంఘం అధ్యక్షులు ఎల్లంపల్లి చిన్నప్పరావు, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఏనిశెట్టి రాజేశ్వరరావు, ఎర్రబోయిన పుల్లయ్య, మాగం కొండలరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు మాగం పవన్, నందినిలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.