Mahaa Daily Exclusive

  అంబేద్కర్ ఆశయ సాధనకు అంకితమైన ఏకైక పార్టీ బీజేపీ..! బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు..

Share

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
  • అంబేద్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
  • బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్, బ్యూరో మహా ;

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, వరంగల్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మదాసు రాజు ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ మైదానం నుండి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, చింతం సాంబమూర్తి, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఇదే సమయంలో, అంబేద్కర్‌ ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

జీవించి ఉన్నప్పుడు అంబేద్కర్‌ ను ఎన్నికల్లో ఓడించడానికి కుట్ర పన్నిన కాంగ్రెస్ పార్టీ, ఆయన మరణానంతరం కనీసం భారతరత్న ఇవ్వడానికి కూడా నిరాకరించిందని గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం అనేకసార్లు సవరించిన కాంగ్రెస్ నేతలు, నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

అంబేద్కర్‌కు సంబంధించిన ఐదు ముఖ్య ప్రాంతాలను ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేసి, ఆయనకు నిజమైన నివాళులర్పించిన ఘనత ప్రధాని మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు.
దళిత, బహుజన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పై ఉందని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం బీజేపీ కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రభరి కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జలగం రంజిత్ రావు, టాబేటి వెంకట్ గౌడ్, బైరి మురళీకృష్ణ, బన్న ప్రభాకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం మహేందర్, గరిగె మాధవి, పోగుల అశోక్, సదానందం, బాబూరావు, దయాకర్, గార్లపాటి మంజుల రెడ్డి, మాచర్ల దీన్ దయాళ్, ఎరుకల రఘునారెడ్డి, బైరి శ్యాంసుందర్, కందిమల్ల మహేష్, ముంద్రాతి వెంకటేశ్వర్లు, మార్తా ఉషారాణి, జిల్లా నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు, నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest