రేప్పాలతిప్ప పరిధిలోని అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ బలగాల దాడుల్లో పెద్దమొత్తంలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు టాస్క్ఫోర్స్ ఇంఛార్జ్ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘‘సోమవారం రాత్రి రేప్పాలతిప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు ఆకస్మిక దాడులు జరిపాయి.
ఆ సమయంలో అక్రమ రవాణా చేసేందుకు ఎర్రచందనం దుంగలు సిద్ధం చేస్తున్న కేవీపురానికి చెందిన సురేంద్ర, నాగలపురానికి చెందిన మునివేలు, తమిళనాడు సేలం జిల్లాకు చెందిన సెల్వరాజి దొరైస్వామితో పాటు మరో ఐదుగురు తమిళ కూలీలను అరెస్టు చేశాం.
వీరి నుంచి సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే 479 కేజీల బరువున్న 69 ఎర్రచందనం దుంగలు, ఒక మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నాం’’ అని వివరించారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్ఫోర్స్ డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్ఐ చిరంజీవి, ఇన్స్పెక్టర్ ఎం.సురేష్ కుమార్, నరేష్, సిబ్బందిని అభినందించారు.







