రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు చేసిందేమీ లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీసీలకు ఏదో నష్టం జరుగుతుంది, దాన్ని సవరించాలటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న తీరును రఘునందన్ రావు తప్పుపట్టారు. పదేళ్ళు మంత్రివర్గంలో బీసీలకు బీఆర్ఎస్ ే మాత్రం ప్రాధాన్యత ఇచ్చిందో అందరికీ తెలుసన్నారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ఎదుగుతున్నారన్న అక్కసుతో ఆయనను బయటకు పంపించింది ఏవరో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందని, ఆ దరిద్రం కేవలం బీఆర్ఎస్ లోని ముగ్గురితోనేనని రఘునందన్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. తప్పుడు పనులకు జైలు శిక్ష పడుతుందని, తామేదో తప్పు చేయలేదన్నట్లు కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తీహార్ జైలు కు వెళ్ళివచ్చినా కవిత మారలేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం లో ఆర్బీఐ అనుమతి లేకుండా కేటీఆర్
దేశ సొమ్మును విదేశాలకు పంపారన్నారు. కేటీఆర్ విషయంలో ఈడీ తన పని తాను చేస్తుందన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాము, వాళ్ళ గురించి బీజేపీ మాట్లాడదని అంటూనే
పదేళ్లు అధికారం లో ఉండి బిఆర్ఎస్ బీసీ లకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించతారు.
10 మంత్రి పదవులు బీసీ లకు ఇవాల్సి ఉన్నా చేసిందేంటో తెలవదా అని నిలదీశారు.
అసెంబ్లీ లో మాట్లాడేందుకు బీసీలే లేరన్నట్లు సమస్యలన్నింటిపై కేటీఆర్, హరీష్లే మాట్లాడుతున్నారన్నారు. గతం మరిచి ఎక్కువగా మాట్లాడితే బీఆర్ఎస్ ను ప్రజలు బండకేసి కొడతారన్నారు. కవిత ఎక్కువగా ఎగిరిపడొద్దని, బోల్తా పడతారని హెచ్చరించారు.








