Mahaa Daily Exclusive

  అంతా కేటీఆరే చేశారు…!

Share

ఫార్ములా ఈ – కార్ రేసులో ఈ రోజు ఏసీబీ విచారణకు ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఆయనను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. ఫార్ములా ఈ – కార్ రేసులో నిధుల మళ్లింపుపై ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరి ఒత్తిడితో నగదు బదిలీ చేశారని అడిగినట్లు తెలుస్తోంది. నగదు బదిలీకి ఆర్ బిఐ అనుమతి ఉందా అని ఎసిబి అడిగినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలతోనే నగదు రిలీజ్ చేశాని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. కేబినెట్ అనుమతి లేకుండా ఎందుకు రిలీజ్ చేశారని ఏసీబీ అధికారుల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. గ్రీన్‌కో స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలడానికి కారణం ఏంటని కూడా అడిగినట్లు సమాచారం. అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది. అరవింద్ కుమార్ చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడి హెచ్ ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డిని ఆరుగంటలు ప్రశ్నించగా, ఆర్వింద్ కుమార్ ఆదేశాలతోనే బదిలీచేసినట్లు పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ చుట్టూ పకడ్బందీగా ఉచ్చు బిగిసినట్టు కనబడుతోంది.

Latest