తిరుపతి ఘటన పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారన్న వార్త తీవ్రంగా కలిచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Post Views: 47








