Mahaa Daily Exclusive

  తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ దిగ్భ్రాంతి, అధికారులపై సీరియస్…..!

Share

తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలచి వేసిందన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జిల్లా కలెక్టర్, టీటీడీ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Latest