Mahaa Daily Exclusive

  సుప్రీంకోర్టు తీర్పు కేటీఆర్‌కు చెంపపెట్టు – తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Share

సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెంపపెట్టని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్.. కుంభకోణం లేదు లంబకోణం లేదని అన్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ తేల్చి చెప్పారు. ఇందుకు కోర్టులూ ప్రభుత్వానికి సహకరించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా ఇళ్ల తలుపులు విరగొట్టి మరీ అరెస్టులు చేయడం లేదని ఆయన విమర్శించారు.

Latest