Mahaa Daily Exclusive

  పార్కింగ్ స్థలం ఉంటేనే కారు కొనుగోలు లేకపోతే నో రిజిస్ట్రేషన్ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్..!

Share

పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. కారు కొనుగోలు చేయాలంటే ముందుగా కారు పార్కింగ్ స్థలాన్ని చూపించాలన్న నిబంధనను అమలు చేయాలని భావిస్తోంది. పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనలను అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలు దారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని.. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందంటూ మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదన్నారు. కారు కొనుగోలు చేయాలనుకుంటే అందుకు అనుగుణంగా తగిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కారు పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారిందని, అనేఖ చోట్ల రోడ్లపైనా, గల్లీలలో కార్లను పార్క్ చేయడం ద్వారా మిగతా కార్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా స్థానికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే పార్కింగ్ స్థలం ముందుగా ఏర్పాటు చేసుకుని తర్వాతే కారు కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నారు.