Mahaa Daily Exclusive

  దేశంలోనే అతి పెద్దది హైదరాబాద్‌లో మల్టీ లెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్…!

Share

హైదరాబాద్, మహా : హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్‌పాసులు నిర్మించింది. తాజాగా రేవంత్ ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక నగరంలో ప్రధాన సమస్య పార్కింగ్. మెయిన్ సిటీలో ఎక్కడా పార్కింగ్ స్థలాలు లేవు. రోడ్లుపై వాహనాలు నిలిపితే ట్రాఫిక్ జామ్‌తో పాటుగా.. పోలీసులు ఫైన్లు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నాంపల్లి మెట్రో స్టేషన్ పక్కన మల్టీ లెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఈ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక వసతులతో ఈ మల్టీ లెవల్ కారు కాంప్లెక్స్‌ను నిర్మించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు రూ.80 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ప్రాజెక్టును నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఆ కాంప్లెక్స్‌ను రూపొందిచారు. నాంపల్లిలో అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ భారీ నిర్మాణం చేపట్టారు. అందులో 10 అంతస్తుల్లో వెహికల్ పార్కింగ్‌కు కేటాయించగా.. మిగిలిన 5 అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్కీన్లతో ఒక సినిమా థియేటర్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో 250 కార్లు, 200 బైకులు పార్క్ చేసే అవకాశం ఉంది. కరోనా తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం కాస్త ఆలస్యం అయినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ మల్టీ లెవల్ కారు పార్కింగ్ కాంఫ్లెక్స్ అందుబాటులోకి రానుండగా ఆ తర్వాత వాహనదారుల ఇబ్బందులు తీరనున్నాయి. కాగా, ఇటువంటి మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నగరంలో మరిన్ని అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాల్లో మరిన్ని పార్కింగ్ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి వస్తే నగరవాసుల పార్కింగ్ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి. ఈ కోణంలో గత కొంత కాలంగా ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. గచ్చిబౌలీ, హైటెక్ సిటీతో ఫాటు సికింద్రాబాద్ లాంటి రద్దీ ప్రదేశాలలో ఇలాంటి మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణఁపై ృష్టి సారించింది. ఇందుకు సంబంధించి పలు కంపనీలతో సంప్రదింపులను కూడా జరుపుతోంది.

Latest