ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తున్నట్లుగా సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా నియామకమయ్యారు. శాంతిభద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఐజీపీ(ఆపరేషన్స్) గా శ్రీకాంత్ బదిలీ అయ్యారు. అదేవిధంగా టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జి. పాలరాజు నియామకమయ్యారు.
Post Views: 55








