Mahaa Daily Exclusive

  నేడు నేషనల్ హగ్గింగ్ డే …!

Share

ఏ ఇద్దరికి సంతోషం కలిగినా లేదా చాలా రోజుల తరువాత కలిసినా మొదటగా చేసే పనేమంటే హాయ్ అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఆ తరువాత అదేవారి మధ్య సాన్నిహిత్యం ఉంటే హగ్గింగ్ చేసుకుంటారు. పండుగలు, శుభకార్యాలు, విజయాల సందర్భాల్లో అయితే ప్రత్యేకించి తప్పనిసరిగా హగ్గింగ్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అదేవిధంగా ఎవరైనా విషాదంలో ఉంటే వారిని హగ్గింగ్ చేసుకుని ఓదార్చి భరోసా ఇస్తారు. ఇలా హగ్గింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడెందుకు ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నాను అంటే నేడు నేషనల్ హగ్గింగ్ డే. ప్రతిసంవత్సరం జనవరి 21న హగ్గింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్గింగ్ కు సంబంధించిన ప్రాముఖ్యతను ఈ సందర్భంగా తెలియపరుస్తుంటారు. అయితే, హగ్గింగ్ డే అనేది హాలిడే కాదు.

కౌగిలింతతో ప్రశాంతత

కౌగిలింత అనేది అత్యంత సహజసిద్ధమైన సంజ్ఞలలో ఇది ఒకటి. అనురాగాన్ని వ్యక్తీకరించేందుకు, ఆప్యాయత లేదా భావోద్వేగాలను తెలియజేసుందుకు హగ్గింగ్ చేసుకుంటారు. అయితే, హగ్గింగ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని సూచిస్తున్నారు. అదేవిధంగా మెరుగైన నిద్రకు కౌగిలి ఎంతగానో దోహదం చేస్తుందని వివరిస్తున్నారు. కౌగిలించుకోవడం వంటిది ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుందని, దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు. కౌగిలింతను స్వీకరించడం వల్ల ఒత్తిడి తగ్గడం, రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు.

అప్పటి నుంచే హగ్గింగ్ డే..

‘హగ్’ అంటే పాత నార్స్ భాషలో ‘ఓదార్పు’ అని అర్థమని చెబుతారు. హగ్గింగ్ డేను మొదటిసారిగా జనవరి 21, 1986న మిచిగాన్‌లోని క్లియోలో జరుపుకున్నారు. అప్పటి నుంచి హగ్గింగ్ డేను జరుపుకుంటున్నారు. హగ్గింగ్ డేను జర్మనీతోపాటు పలు దేశాల్లో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు.