Mahaa Daily Exclusive

  నూజివీడు: పంచాయతీల పాలనపై దృష్టి పెట్టాలి…!

Share

నూజివీడు డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ పాలనపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి కే. అనురాధ ఆదేశించారు. గురువారం నూజివీడు ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో గల వెలుగు కార్యాలయంలో పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆమె నిర్వహించారు. పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ, ఇతర అంశాలపై ఆమె సమీక్షించారు.