Mahaa Daily Exclusive

  ఘ‌నంగా మంత్రి నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు…!

Share

అనకాపల్లి జిల్లా ,న‌క్క‌ప‌ల్లి ,మహా :
రాష్ట్ర హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆద్వ‌ర్యంలో పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మ‌దిన వేడుక‌ల ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలుగు యువ‌త,ఐ టిడిపి,టిఎన్ ఎస్ ఎఫ్ నాయక‌లు నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ కార్య‌క్రమాలు చేప‌ట్టారు.న‌క్క‌ప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుపత్రిలో రోగుల‌కు పండ్లు పంపిణీ చేశారు.అనంత‌రం న‌క్క‌ప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి నుండి సారిప‌ల్లిపాలెం హోంమంత్రి స్వ‌గ్ర‌హం వ‌రకు పాద‌యాత్ర నిర్వ‌హించారు.యువనేత లోకేష్ నాయ‌క‌త్వం వ‌ర్థిల్లాల‌ని నినాదాల‌తో హోరొత్తించారు. మంత్రి అనిత ఇంటివ‌ద్ద కేక్ కట్ చేసి,నారా లోకేష్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని నేతలు కొనియాడారు.యువగళం పాదయాత్రతో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందారన్నారు.
టీడీపీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, టీడీపీ నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షలు కొప్పిశెట్టి వెంకటేష్‌, ఎస్‌ రాయవరం మండల పార్టీ అధ్యక్షలు అమలంకంటి అబద్ధం, ఐటీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షలు శ్రీనివాసు, తెలుగు యువత నాయకులు పద్దు, రామకృష్ణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అనకాపల్లి జిల్లా అధ్యక్షలు పెద్దిరెడ్డి వెంకటరమణ, కొప్పిశెట్టి బుజ్జి, వైనబోయిన రమణ,గోసల శ్రీకాంత్, పాయకరావుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షరాలు రమాకుమారితో పాటు నాలుగు మండలాలు నాయకులు పాల్గొన్నారు.