గ్రామసభ తీర్మానం లేకుండా మా పంచాయితీ మాజీ సర్పంచ్ గ్రామ కంఠంలో ఉన్న స్థలాన్ని తన అనుచరుడకు పొజిషన్ ఇవ్వాలని వీఆర్వో కి ఒత్తిడి చేసి లంచం ఇచ్చి మరీ పొజిషన్ సర్టిఫికెట్ తో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆక్రమణకు దిగుతున్నారని నిరసన చేపట్టిన గ్రామస్తులు
వాయిస్: జిల్లాలోని లావేరు మండలం తామాడ పంచాయతీలో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు.
గ్రామస్తులు అందరూ కలిసి ఈ స్థలం గ్రామానికి ఉపయోగపడే స్థలం కావున నువ్వు ఎలా ఆక్రమిస్తున్నావని మాడుగుల దుర్గాప్రసాద్ అనే వ్యక్తిను నిలదీయడంతో మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు సహకారంతో ప్రశ్నించిన గ్రామస్తులు. గ్రామ పెద్దలపైన తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పంచాయితీ సచివాలయం ముందు గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో నిరసనకు దిగారు.చాలా సంవత్సరాలుగా గ్రామానికి చెందిన గ్రామ కంఠంలో ఉన్న కొంత స్థలంపై కన్నేసిన మాడుగుల దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి తమ గ్రామ మాజీ సర్పంచ్ గుట్టు చప్పుడు కాకుండా దారాదత్తం చేయడం ఎంత వరకు సమంజసమని మహిళలు ప్రశ్నిస్తూ, గ్రామ ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు గ్రామ కంఠంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులును కోరారు.ఈ నిరసన కార్యక్రమం వద్దకు లావేరు పోలీస్ స్టేషన్ ఎస్సై జి.లక్ష్మణరావు చేరుకొని నిరసన చేస్తున్న వారితో మాట్లాడి సమస్యను అధికారులుతో విచారించి, వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని మాట ఇవ్వడంతో నిరసనకారులు తమ నిరసనను విరమించుకున్నారు.ఏది ఏమైనప్పటికీ ఎవరైతే అక్రమంగా గ్రామకంఠంలో ఉన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.








