Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు…!

Share

ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ

నీలమణిదుర్గ గుడిలో 1001 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..

ప్రభుత్వ హాస్పిటల్ లో రొట్టెలు,పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్..

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు..

పాతపట్నం :

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు వారి కార్యాలయం లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయంలోనాయకులు, కార్యకర్తలు,అభిమానుల సమక్షంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం నీలమణి దుర్గ అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకుని లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం తో పాటు 1001 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే ఆలయప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి అనంతరం వృద్ధులు ,పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సిహెచ్సీలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు.

ఈ జన్మదిన వేడుకలకు ఐదు మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు.