కెఆర్ఎంబి సమావేశానికి ముందే ఏపీ- తెలంగాణ నీటి వివాదాలపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. కడప జిల్లా సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టుల వారీగా కేటాయించిన 811 టిఎంసి లలో, రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర జిల్లా శక్తి చేసిన సర్దుబాటు ప్రకారం ఏపీకి 512.06టీఎంసీలు, తెలంగాణకు 298.94 టీఎంసీలు ఇప్పటివరకు వినియోగంలో ఉన్నాయన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ లో లభ్యత ఆధారంగా ఏపీ 66%, తెలంగాణ 34% వాడుకునేలా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం నిర్ణయిస్తూ వచ్చిందన్నారు. అంతకుముందు
నీటి వివాదాలపై ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీలుగా లెక్క గట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయగా మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు కల్పించిందన్నారు. తర్వాత ఏర్పడిన బ్రీజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా లెక్క కట్టి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసి మిగులు జలాల ఆధారంగా నిర్మితమవుతున్న గాలేరు నగరి హంద్రీనీవా వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా వెనుకబడిన రాయలసీమ నోట్లో మట్టి కొట్టిందన్నారు. జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్న పట్టించుకోకుండా యధావిధిగా అమలు చేయాలని ఆఫిడవిటు దాఖలు చేసి కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎగుబద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటి కేటాయింపుల పున : సమీక్ష పేరుతో రాయలసీమకు అన్యాయానికి తలపెట్టిన బ్రిజేష్ కుమార్ ట్రిబనాలకు కట్టబెట్టడం కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. బ్రెజేష్ కుమార్ తీర్పు అమలు కాకుండా ఒకవైపు సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను జటిలం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కరువు పీడిత రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుపడుతుందన్నారు. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగుల అమలు చేయకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో వేల టీఎంసీల నీటిని సముద్రంలో వదిలేస్తుందన్నారు. త్రిభుణాల కేటాయింపులకు అనుగుణంగా నేటి వినియోగం అమల ఎందుకు కేఆర్ఎంపి పరిధిని నిర్ణయించాలని కోరితే అంతర్రాష్ట్ర పరిధిని దాటి ఆయా రాష్ట్రాలలో పిల్ల కాలువలను కూడా నియంత్రించేంత పరిధిని ప్రకటించడం విచారకరమన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, వినియోగం, వివాదాలపై సమగ్రమైన చర్చ జరగాలని రాష్ట్రానికి కేటాయించిన నీటి కేటాయింపుల్లో హక్కును కోల్పోతే దాని ప్రభావం రాయలసీమ పై పడుతుందని వారన్నారు. అయితే దాన్ని నేడు తెలంగాణ ప్రభుత్వం 50 శాతం తమకు వాటా కావాలని వితండవాదం చేస్తున్న నేపథ్యంలో 27వ తేదీన మరో మారు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరుగుతున్నందున ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి నీటి హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.
కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు తరలించి కర్నూలులో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు








