Mahaa Daily Exclusive

  పిఠాపురంలో జనసేన ప్లీనరీ సమావేశాలు….!

Share

జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్లీనరీ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12, 13, 14 తేదీలలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్లీనరీ నిర్వహణకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం నియోజకవర్గంలో స్థలం పరిశీలించారు.