Mahaa Daily Exclusive

  విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయం: బీటెక్ రవి

Share

రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీటెక్ రవి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని ఆరోపించారు. జగన్ డిస్‌క్వాలిఫై అవ్వడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కాబోతోందన్నారు.