Mahaa Daily Exclusive

  అఖిలభారత అగ్రగామి మహిళా సమితి ప్రధమ రాష్ట్ర మహాసభ లను జయప్రదం చేయండి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వి సుందర రామరాజు

Share

అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర మొదటి మహాసభలు ఫిబ్రవరి 12 13 తేదీలలో కడప నగరంలో అన్ని ఐఎంఏ హాల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వి సుందర రామరాజు చెప్పారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా దగ్గరగా మీ మహిళా సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎం.యల్.ఏ పూర్ణిమ బిశ్వాస్, జాతీయ కమిటీ సభ్యురాలు పి ఎస్ ఆర్ ఎస్ ప్రవళికలు హాజరుకానున్నట్లు ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూల నుండి మహిళ ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939 సంవత్సరంలో ఈ దేశానికి సత్యాగ్రహాలతో నిరాహార దీక్షలతో స్వాతంత్రం సిద్ధించదని, సాయుధ పోరాటంతో మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐ ఎన్ ఏ లో మహిళలకు స్థానం కల్పించడం కోసం “ఝాన్సీ లక్ష్మీ సేన” పేరుతో కెప్టెన్ లక్ష్మీ సైగల్ సారధ్యంలో మహిళా సాయుధ తిరుగుబాటు నిర్మాణం జరిగిందన్నీరు. కాలక్రమంలో ఐఎన్ఏ సైన్యం 1943 అక్టోబర్ 26 నాటికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏ హెచ్ ఎఫ్ ప్రభుత్వం ప్రకటన చేయడం 1943 డిసెంబర్ 30న అండమాన్ నికోబార్ దీవులలో ఆజాద్ హింద్ పౌజ్ నూతన భారత ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. కార్యక్రమంలో రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాల నేపథ్యంలో 1947లో బ్రిటిష్ వారు, వలసలను వదులుకొని నేతాజీ భయంతో ఈ దేశానికి షరతులతో కూడిన స్వాతంత్రం ప్రకటించడం జరిగిందనీ వారు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలకు ఆస్తి హక్కు,అంటరానితనం విద్యా,ఉపాధి,ఉద్యోగాలకు రిజర్వేషన్లు కల్పించాలని , మహిళలపై అత్యాచారాలును నిరోధించడం, చట్టసభలలో సగభాగం ప్రాతినిధ్యం కల్పన కోసం కులము,ప్రాంతీయ ఏర్పాటు వాద తత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నదన్నారు. ఈ మహాసభలలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సుబ్బమ్మ, హిమబిందు, అరుణ కుమారి లు పాల్గొన్నారు.