Mahaa Daily Exclusive

  అంగన్వాడీ స్కూల్ అభివృద్ధికి భారతి సిమెంట్స్ సహాకారం అందించడం అభినందనీయం -కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి

Share

అంగన్వాడీ స్కూల్ అభివృద్ధికి భారతి సిమెంట్స్ సహాకారం అందించడం అభినందనీయం కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ప్రసంశించారు. శనివారం భారతి సిమెంట్స్ అధికారులతో కలిసి ఆయన అంగన్ వాడి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం, హాస్పెటల్స్ , డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్కూల్స్ అభివృద్ధి చేస్తున్న తరుణంలో భారతి సిమెంట్స్ యాజమాన్యం అభివృద్ధి కి తమ వంతు కృషి చేసేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. అంతే కాకుండా నగర పంచాయతీలో, మండలం లో స్వచ్ఛ సేవ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్, గ్రామాల అభివృద్ధికి సహకారం అందించాలి భారతి సిమెంట్స్ యాజమాన్యాన్ని కోరారు.