Mahaa Daily Exclusive

  నేను పార్టీ మారను: వైసీపీ ఎంపీ బోస్

Share

ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి వెన్నెముకగా పని చేశారని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తే.. ప్రస్తుతం తమకున్న సంఖ్యాబలం రీత్యా రాజ్యసభకు తిరిగి ఎంపికయ్యే పరిస్థితి లేదన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, ఆ జాబితాలో విజయసాయిరెడ్డి ఉంటారని ఊహించలేదన్నారు. తాను మాత్రం పార్టీ మారనని ఎంపీ చంద్రబోస్ తెలిపారు.