ఏపీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు గురు, శుక్రవారాల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. విఐపీ రోడ్డు లోని హోటల్లో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు దేశం నలుమూలల నుంచి 32 మంది కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు.
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు!
Post Views: 30








