Mahaa Daily Exclusive

  అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి – ఐటిడిఎ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి

Share

ఐటీడీఏ ద్వారా ఇచ్చే జీవనోపాధి పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జీవనోపాధి పథకాలకు సంబంధించి సంబంధిత అధికారులతో పీవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సీసీడీపీ మరియు ఎస్సి ఏ టు టిఎస్ఎస్ పథకాల కింద మంజూరైన జీవనోపాధి పథకాలకు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఎంపిక చేయాలని, గతంలో ఎటువంటి జీవనోపాధి పథకాలు పొందకుండా ఉండాలని అన్నారు. అదే విధంగా సోమవారం గ్రీవెన్స్ కి వచ్చే లబ్ధిదారులకు చూసుకోవాలని అన్నారు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, వెలుగు ఏపీడి సన్యాసిరావు, డిపిఎం రమణ, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.