ప్రజల భాగస్వామ్యముతోనే కు వ్యాధి నిర్మూలన సాధ్యం అని డిఎంహెచ్వో డా బాలమురళీకృష్ణ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి వర్ధంతి సందర్భంగా జనవరి 30 గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో “కుష్టు వ్యతిరేక దినం” ర్యాలీని డిఎంహెచ్వో డా బాలమురళీకృష్ణ జండా ప్రారంభించారు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా వైద్య సిబ్బంది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యముతోనే కు వ్యాధి నిర్మూలన సాధ్యమని అన్నారు.ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞ ను చేశారు. డి ఎల్ ఓ డా శ్రీకాంత్ డిపిఎంఓ వాన సురేష్ కుమార్, డిఎన్ఎమ్ఓ డా.ప్రవీణ్ డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 84








