Mahaa Daily Exclusive

  బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన ఆత్రం సుగుణ…!

Share

పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ ఖండించారు. గురువారం ఉట్నూరులో మీడియతో మాట్లాడారు. గద్దర్ పదవుల కోసమో, డబ్బు కోసమో, అవార్డుల కోసమో తన జీవితాన్ని ఫణంగా పెట్టి పని చేయలేదని తెలంగాణ కోసం, పీడిత, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాలు, మహిళల కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు.