అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ పండువగా ప్రకటించడంపై పెనుగొండలో శుక్రవారం ఆర్యవైశ్యులు, భక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేజేలు పలికారు. సీఎం సుమారు రెండు గంటల పాటు అమ్మవారి సన్నిధిలో భక్తిపారవశ్యంతో గడిపారు. ఆలయం బయట గ్యాలరీలో ఉన్న ప్రముఖులు, అధికారులు, భక్తులను పలకరించి కరచాలనం చేశారు. అక్కడి నుంచి యార్డు ఆవరణలో గీత కార్మికులు కృతజ్ఞత భావంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్ని సత్కరించారు.
Post Views: 37







