తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ. జి. ఎస్ మూర్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తూ. గో. జిల్లా గంగవరం గ్రామానికి తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై మూర్తి మరణం వెనుక ఎవరున్నారో అధికారులు తేల్చాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Post Views: 32







