Mahaa Daily Exclusive

  రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల…!

Share

రైతులు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులు గరిష్ఠ ధరలు పొందేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇందు కోసం మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌లకు పంపించాలని సూచించారు. వేరుశనగ, మిర్చి తదితర పంటలకు మార్కెట్లలో ధరలు తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించాల్సిందేనని చెప్పారు.