Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం….!

Share

హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగ్ సెల్లార్‌లో ఈ ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తుల్లో దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సాయంతో కొందరిని కిందికి దింపారు. ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు.