Mahaa Daily Exclusive

  ఏలూరులో రేపటి గ్రీవెన్స్ డే రద్దు…!

Share

ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లా, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో జరగాల్సిన అన్ని గ్రీవెన్స్ డే కార్యక్రమాలను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు ఎవరూ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఏలూరుకు రావద్దని కోరారు.