దేశ ఆర్థిక వ్యవస్థకువెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు.
ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు.
ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు.
మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం..
రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు.
జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోందని తెలిపారు.
దేశానికిసుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్గా పనిచేస్తుందన్నారు.
సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు
Post Views: 136








