Mahaa Daily Exclusive

  ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని మృతి…!

Share

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం మండలం గునుపూడి గరువపేటలో జరిగింది. డిగ్రీ చదువుతున్న అనూష(19) సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ నెల 3న ఫోన్‌లో ఇద్దరికి ఘర్షణ జరిగింది. కాసేపటికి అనూష సోదరికి సత్యనారాయణ ఫోన్ చేసి మీ సోదరి చనిపోతా అంటుంది చూడమని చెప్పాడు. అనూష రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.