Mahaa Daily Exclusive

  రిజర్వేషన్ల కోసమే కులగణన: టీపీసీసీ చీఫ్

Share

TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం మందే సర్వేలో పాల్గొనలేదు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అలాగే పార్టీలో ఎంతటివారైనా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. రూల్స్ పాటించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.