Mahaa Daily Exclusive

  ఢిల్లీలో కమలం టుడే చాణక్య సర్వే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ది ఒకే అంచనా…!

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్‌ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ పోటాపోటీగా తమ అంచనాలు పేర్కొంటున్నాయి. టుడే చాణక్య సర్వేలో బిజెపికి 40-45, ఆప్ కు 25-30, కాంగ్రెస్ కు 0-2 స్థానాలు వస్తాయని తేలింది. ఓటింగ్‌ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలను ఎగ్జిట్ పోల్స్‌ వివరాలను ప్రకటించాయి. ఈ సారి ఢిల్లీ పీఠం బీజేపీదేనని మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. జేవీసీ పోల్‌ బీజేపీకి 39-45, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 32-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్‌ నౌ బీజేపీకి 39-45, ఆప్‌కి 22-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొంది. మ్యాట్రిక్స్‌ సంస్థ ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఆప్‌కు 25-28, బీజేపీకి 39,45, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వస్తాయని చెప్పింది. పీపుల్స్‌ పల్స్‌ కాంగ్రెస్‌కు ఆప్‌కు 10-19, బీజేపీకి 51-60 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ ఆప్‌కు 25-29, బీజేపీకి 40-44, కాంగ్రెస్‌కు 0- ఒక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్‌ దీక్షిత్‌, బీజేపీకి చెందిన ప్రవేశ్‌ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు.