ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా ఆయన చర్చించవచ్చని సమాచారం.
Post Views: 104








