ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపికబురు

ఏపీ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు విజ్ఞప్తితో క్రీడా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. వైసీపీ హయాంలో రూ.11.68 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయని,
కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం రేవంత్

కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పెద్దలకు కులగణన వివరాలు తెలియజేయనున్నారు. సీఎంతోపాటు దీపాదాస్‌మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్ చేసిన బీజేపీ: సంజయ్ సింగ్

ఆమ్‌ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజీపీ విస్తృత ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేశారని.. ఇప్పటివరకు ఏడుగురిని సంప్రదించారని అన్నారు.
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP

TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్‌లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే
తీన్మార్ మల్లన్నకు షో కాజ్ నోటీసులు..!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన నివేదికను కాల్చివేయడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పీసీసీ చీఫ్‌తో చర్చించిన తర్వాత తీన్మార్ మల్లన్నపై
మోసాల గురించి జగనే చెప్పాలి: మంత్రి అనగాని

AP: మోసాల గురించి జగన్ చెబుతుంటే ప్రజలు ఫక్కున నవ్వుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విమర్శించారు. అధికారంలో ఉండగా MLAలను కలవని
పదవుల ఖరారు వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ
కేంద్ర విద్యాశాఖ మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి…!

ఢిల్లీ పర్యటనలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ ను మార్చాలని పిటిషన్ ఇచ్చారని.. కొత్త నిబంధనల వల్ల
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం…!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 21 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల
సీఎం రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న సీఎల్పీ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు
