Mahaa Daily Exclusive

  పింఛన్ల సైట్ ఓపెన్ చేయాలని వినతి…!

Share

వృద్ధులు, వికలాంగులు పింఛన్లు పొందడానికి సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు పడుతున్నారని భారతీయ గోర్ బంజార పోరాట సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ నాయక్ తెలిపారు. ఈ విషయమై బుధవారం జూలూరుపాడు మండల సూపరింటెండెంట్ తాళ్లూరి రవికి వినతిపత్రం అందజేశారు. మండల వ్యాప్తంగా ఇదే సమస్యలు ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం సైట్ ఓపెన్ చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.