Mahaa Daily Exclusive

  ఏపీలో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు.. తెలుగు భాషలో కూడా…!

Share

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు(G.0.లు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్ లకు సంబంధించిన G.Oను తెలుగు భాషలో విడుదల చేశారు. ప్రతీ G.O మొదట ఇంగ్లీషులో విడుదల కానుంది. ఆ తరువాత రెండు రోజుల్లోపు అదే G.Oను తెలుగు భాషలో జారీ చేస్తారు