అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, పూర్తైన ఇందిరమ్మ మోడల్ గృహాల గ్రౌండింగ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలన్నారు.
Post Views: 43








