Mahaa Daily Exclusive

  కులగణన మళ్లీ చేయాలి: మాజీ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్

Share

TG: కులగణన మళ్లీ చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే లెక్కల్లో స్పష్టత లేదని, ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. 2014 కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సర్వే కంటే ఇప్పటి సర్వేలో జనాభా 62 లక్షలు తగ్గిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.